News April 13, 2025
రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు

AP: తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ప్రజల హక్కులను కాపాడడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం YS జగన్ అని, గత ఐదేళ్లలో ఆయన రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని అన్నారు. ఆయన వల్ల ఐదేళ్ల విలువైన సమయం కోల్పోయామని పేర్కొన్నారు.
Similar News
News April 18, 2025
వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్‌గా యుద్ధ బాధితుడి చిత్రం

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో గాయపడిన ఓ బాలుడి చిత్రం ఈ ఏడాది వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. పాలస్తీనాకు చెందిన ఫొటోగ్రాఫర్ సమర్ అబు ఎలూఫ్ ఈ ఫొటో తీశారు. ఈ చిత్రంలోని బాలుడు రెండు చేతులు కోల్పోయి దీనస్థితిలో కనిపిస్తున్నాడు. ఈ యుద్ధం వల్ల భవిష్యత్తు తరాలు ఎలా అంధకారంలోకి వెళ్లాయో ఈ చిత్రం చెబుతుందని వరల్డ్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.
News April 18, 2025
కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాదని నిరూపించే సమయమిది: కేటీఆర్

TG: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రధాని మోదీ కేవలం మాటలకే పరిమితం కావొద్దని KTR కోరారు. అందులో జీవవైవిధ్యాన్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థిక కుంభకోణం జరిగిందని చెప్పారు. భూముల తాకట్టు వ్యవహారాన్ని CBI, SEBI, RBI దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. TGలో కాంగ్రెస్, BJP ఒకటి కాదని నిరూపించే సమయమిదని వ్యాఖ్యానించారు.
News April 18, 2025
మెలోనీ అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్

ఇటలీ PM జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని ట్రంప్ తెలిపారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని అని, వ్యక్తిగతంగానూ ఆవిడతో మంచి అనుబంధం ఉందన్నారు. ఆవిడలో చాలా ప్రతిభ ఉందని, ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరంటూ కొనియాడారు. టారిఫ్స్ పెంపుపై US వైఖరిని మెలోనీ వ్యతిరేకించినా.. యూరోపియన్ దేశాల నుంచి ట్రంప్‌ని కలిసిన తొలి ప్రధాని ఆవిడే.