News September 12, 2025

కూకట్‌పల్లి: హత్య చేసిన ఇంట్లోనే స్నానం చేసిన నిందితుడు

image

రేణు అగర్వాల్‌ను నిందితుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మొదటగా కాళ్లు చేతులు కట్టేసి కత్తితో పొడిచి గొంతు కోసి హతమార్చాడు. వంటింట్లో ఉన్న ప్రెషర్ కుక్కర్‌తో తలపై కొట్టి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోనే స్నానం చేసి తన స్నేహితుడితో కలిసి బైక్‌పై పరారయ్యాడు. భర్త కుమారుడు ఇంటికి వచ్చి చూసేసరికి రేణు రక్తపు మడుగుల్లో ఉండటాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు.

Similar News

News September 12, 2025

భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధరలు

image

AP: రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా కిలో రూ.2కి పడిపోయింది. నంద్యాల, మదనపల్లె మార్కెట్లలో రూ.3-రూ.10 వరకు పలికింది. అటు కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు ఉల్లి క్వింటా రూ.150 చొప్పున కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. దీంతో కూలీ ఖర్చులు కూడా రావట్లేదని వాపోయారు.

News September 12, 2025

చింతపల్లి: అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు 15న స్పాట్ కౌన్సెలింగ్

image

ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 15న స్పాట్ కౌన్సెలింగ్ జరగనుందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న, చేయించుకోని విద్యార్థులు సైతం గుంటూరు లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగే స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చన్నారు.

News September 12, 2025

KMR: కేటీఆర్‌కు చేతనైతే వారితో రాజీనామా చేయించు: మంత్రి సీతక్క

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి సీతక్క అన్నారు. బిక్కనూర్‌లో గురువారం రాత్రి నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేటీఆర్‌కు చేతనైతే అప్పట్లో TDP, కాంగ్రెస్ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, వివేకానంద గౌడ్‌లతో రాజీనామా చేయించాలన్నారు. తరువాత కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడాలన్నారు.