News January 10, 2026
కొత్తూరు: రహదారిపై బస్సు..వెళ్లేదెలా బాసు

కొత్తూరు మండల కేంద్రంలో ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. కొత్తూరు నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక ఈ ఇబ్బందులు తప్పలేదు. శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులు ఖాళీ లేకపోవడంతో ఇలా కిక్కిరిసి గమ్యస్థానాలకెళ్లారు. ఫ్రీ బస్సు, పండగ రద్దీ కూడా దీనికి తోడైంది. అధికారులు స్పందించి తగినన్ని బస్సులు నడపాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.