News February 13, 2026
క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీపై లోక్‌సభలో ఎంపీ ప్రశ్న

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీ వినియోగంపై ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటు, మార్గదర్శకాలు, రోగుల అర్హత ప్రమాణాలపై కేంద్ర ఆరోగ్య శాఖను వివరణ కోరారు. కేంద్ర సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ.. అవసరమైన సదుపాయాలు ఉన్న ప్రభుత్వ తృతీయ శ్రేణి ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటులో ఉందని వెల్లడించారు.
Similar News
News February 14, 2026
విశాఖ: అరుదైన రక్తం 57వసారి దానం

విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం(సేఫ్టీ) కర్రి శ్రీనివాస్ అరుదైన O-నెగటివ్ రక్తాన్ని 57వసారి దానం చేసి సేవా స్ఫూర్తిని చాటారు. గుండెపోటుతో కేజీహెచ్‌లో శస్త్రచికిత్సకు సిద్ధమైన హిరమండలం ప్రాంతానికి చెందిన రామారావుకు అత్యవసరంగా రక్తం అవసరమవడంతో ఆయన స్పందించారు. అవసరమైన వారికి రక్తం దానం చేయడం సంతృప్తిని ఇస్తోందని ఆయన అన్నారు.
News February 14, 2026
NZB: కింగ్ మేకర్‌గా BRS కార్పోరేటర్ విజయలక్ష్మీ

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో 37వ డివిజన్ నుంచి BRS అభ్యర్థిగా గెలిచిన ప్యాట విజయలక్ష్మి కింగ్ మేకర్‌గా మారనున్నారు. కార్పొరేషన్‌లో అధికారం సాధించేందుకు ఆమె మద్దతు కీలకంగా మారడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు తమవైపు తిప్పు కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ ఆమెను వారి క్యాంప్‌నకు తరలించారని సమాచారం.
News February 14, 2026
NTR: మృత్యువుకు బ్రేక్ వేసిన పోలీసులు.. ముగ్గురు సేఫ్

కుటుంబ కలహాలతో పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు కాపాడారు. చిలకలపూడికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో ప్రకాశం బ్యారేజీపై నుంచి దూకబోతుండగా ట్రాఫిక్ RSI శ్రీధర్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ భూషణం సకాలంలో స్పందించి వారిని అడ్డుకున్నారు. ప్రాణాపాయం నుంచి తప్పించి, తదుపరి చర్యల నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల సమయస్ఫూర్తిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


