News February 14, 2026

NZB: కింగ్ మేకర్‌గా BRS కార్పోరేటర్ విజయలక్ష్మీ

image

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో 37వ డివిజన్ నుంచి BRS అభ్యర్థిగా గెలిచిన ప్యాట విజయలక్ష్మి కింగ్ మేకర్‌గా మారనున్నారు. కార్పొరేషన్‌లో అధికారం సాధించేందుకు ఆమె మద్దతు కీలకంగా మారడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు తమవైపు తిప్పు కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ ఆమెను వారి క్యాంప్‌నకు తరలించారని సమాచారం.

Similar News

News April 20, 2026

నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

image

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News April 20, 2026

బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

image

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.