News January 4, 2026
ఖమ్మం జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు

ఖమ్మం జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం 13,795 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఇందులో మార్క్ ఫెడ్ వద్ద 9,736 టన్నులు, ప్యాక్స్ కేంద్రాల్లో 900, ప్రైవేట్ డీలర్ల వద్ద 663 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు పేర్కొన్నారు. అవసరానికి మించి ఎరువులను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని హితవు పలికారు.
Similar News
News April 20, 2026
KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.