News January 4, 2026

ఖమ్మం: మున్సిపల్‌ సమరం.. గెలుపు గుర్రాల కోసం ఆరా

image

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. గత ఎన్నికల్లో సత్తుపల్లి, మధిర, వైరాలో క్లీన్‌స్వీప్ చేసిన బీఆర్ఎస్.. ఈసారి అదే పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఆధిక్యంతో మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. గెలుపు గుర్రాల కోసం ఆరా తీస్తూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. కాగా కొత్తగా కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.