News April 2, 2026

ఖమ్మం: మే 11 నుంచి ‘గృహగణన’

image

దేశవ్యాప్త జనగణనలో భాగంగా ఉమ్మడి ఖమ్మంలో మే 11 నుంచి జూన్ 9 వరకు గృహగణన నిర్వహించనున్నారు. ఈ మేరకు సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ షెడ్యూల్ విడుదల చేశారు. అధికారులు మొబైల్ యాప్ ద్వారా ఇంటి వసతులు, ఆస్తులపై 34 ప్రశ్నలతో వివరాలు సేకరిస్తారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తి కాగా, యంత్రాంగం సర్వేకు సిద్ధమైంది.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.