News April 2, 2026

ఖమ్మం: మైనార్టీలకు వృత్తి శిక్షణ కోర్సులు

image

ఖమ్మం జిల్లాలోని మైనార్టీ (ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన్, పార్శీ) అభ్యర్థులకు రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ముహమ్మద్ ముజాహిద్ తెలిపారు. జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, టైలరింగ్ కోర్సుల్లో 3 నెలల పాటు ఈ శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 97040 03002 నంబరును సంప్రదించాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.