News February 10, 2026

ఖమ్మం: రెండు రోజులు సెలవు ప్రకటించిన కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈనెల 11న జరగనున్న ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ జరగనున్న వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి, ఏదులాపురం పరిధిలో ఈనెల 10, 11వ తేదీల్లో స్థానికంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 11న జరిగే పోలింగ్‌లో ఓటర్లందరూ పాల్గొనేలా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఇచ్చారు. కాగా 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.