News March 7, 2025

గద్వాల: ఏడు మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి

image

జోగులాంబ గద్వాల జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 7 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. జోగులాంబ గద్వాల జోన్ DIG ఎల్.ఎస్. చౌహన్ అందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం జారీ చేశారు. ఈ సందర్భంగా DIG ఎల్.ఎస్. చౌహన్ పదోన్నతి పొందిన పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News

News March 9, 2025

త్వరలోనే జీఎస్టీ రేట్లు మరింత తగ్గింపు: నిర్మలా సీతారామన్

image

త్వరలోనే జీఎస్టీ రేట్లను మరింతగా తగ్గిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ అవసరాలకు తగ్గట్లుగా సవరణలు ఉండేలా చూస్తున్నామని తెలిపారు. దీంతో పాటు ట్యాక్స్ స్లాబ్‌లను రేషనలైజ్ చేస్తామన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు పెరగలేదని పేర్కొన్నారు. పన్ను చెల్లించేవారికి ఉపశమనం కలిగించడమే తమ లక్ష్యమన్నారు. స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులకు కారణాలను కచ్చితంగా చెప్పలేమన్నారు.

News March 9, 2025

మెదక్‌లో లోక్ అదాలత్.. 1500 కేసుల్లో రాజీ

image

మెదక్ జిల్లాలోని కోర్టు ప్రాంగణాల్లో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద ఆధ్వర్యంలో 1500 కేసుల్లో రాజీ పడ్డారు. రూ.46 లక్షల 32వేల పరిహారం ఇప్పించారు. సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, జూనియర్ సివిల్ జడ్జి సిరి సౌజన్య, మొబైల్ కోర్టు జడ్జి సాయి ప్రభాకర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.

News March 9, 2025

ముంబై జట్టులోకి ఆల్‌రౌండర్

image

గాయంతో ఐపీఎల్ 2025కు దూరమైన లిజాడ్ విలియమ్స్ స్థానంలో ముంబై ఇండియన్స్ దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ను తీసుకుంది. 2014లో U19 WC గెలిచిన సఫారీ టీమ్‌లోని కార్బిన్ బాష్‌ను జట్టులోకి తీసుకున్నట్లు MI ట్వీట్ చేసింది. కాగా 86 టీ20లు ఆడిన కార్బిన్ 59 వికెట్లు తీయగా బ్యాటింగ్‌లోనూ సత్తా చాటారు. ఇప్పటికే ముంబై జట్టులో హార్దిక్ పాండ్య, సాంట్నర్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు.

error: Content is protected !!