News April 16, 2026

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి లక్ష్యం: మంత్రి అచ్చెన్న

image

టెక్కలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని మంత్రి అచ్చెన్న అధికారులను హెచ్చరించారు. గురువారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్, రహదారులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన డీఈ, ఏఈలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.