News September 12, 2025
జనగామ: యాత్రాదానం బస్సు బహుమతిగా ఇవ్వాలి: కలెక్టర్

జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. “యాత్రాదానం – బస్సును బహుమతిగా ఇవ్వండి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులకు పారదర్శకంగా ప్రయోజనం చేకూరేలా చూడాలని ఆదేశించారు. పథకం అమలులో నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. ప్రయాణికులు, యాత్రీకులు, సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News September 12, 2025
పాడేరు: మీకోసం కార్యక్రమానికి 134 ఫిర్యాదులు

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 134 ఫిర్యాదులు అందాయి. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, సబ్ కలెక్టర్‌తో కలిసి కలెక్టర్ దినేశ్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News September 12, 2025
పెద్ద శంకరంపేట : మనస్థాపంతో బావిలో దూకి యువకుడి మృతి

పెద్ద శంకరంపేట మండలంలోని ముసపేటకి చెందిన గంగమేశ్వర్ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిఅతడు తిరిగి రాలేదు. గంగమేశ్వర్ ఇటీవల ఓ కేసులో జైలుకు వెళ్ళి పది రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చాడు. మనస్థాపంతోనే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 12, 2025
నేపాల్ తాత్కాలిక పీఎంగా సుశీల

నేపాల్ తాత్కాలిక పీఎంగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ఎంపికయ్యారు. కాసేపట్లో ఆమె నేపాల్ తొలి మహిళా PMగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుశీల పేరును Gen-z యువత ప్రతిపాదించగా ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ ఆమోదించారు. నిన్నటి నుంచి ఆర్మీ సమక్షంలో నిరసనకారులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అనంతరం పార్లమెంట్‌ను రద్దు చేశారు. కాగా సుశీలకు భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె మన దేశంలో విద్యనభ్యసించారు.