News April 7, 2026

‘జలధార’ విజయానికి శాఖల మధ్య సమన్వయం ముఖ్యం: కలెక్టర్

image

‘జలధార’ కార్యక్రమం సత్ఫలితాలు సాధించడంలో ఇరిగేషన్, ఇతర శాఖల మధ్య సమన్వయం కీలకమని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రి కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో జలధార-జలహారతి కార్యక్రమాలు భూగర్భ జలాల పెంపునకు దిశానిర్దేశం చేస్తున్నాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు అంకితభావంతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని ఆమె ఆదేశించారు.

Similar News

News April 20, 2026

కాయకవే కైలాస.. బసవన్న మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం!

image

బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం సంఘ సంస్కర్త బసవన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “కాయకవే కైలాస” అనే ఆయన బోధన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 20, 2026

దళారుల ఉచ్చులో పడకండి: DTO

image

తూ.గో (D) రవాణాశాఖ సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నట్లు DTO ఆర్. సురేశ్ సోమవారం తెలిపారు. లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని వినియోగదారులకు సూచించారు. సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఎవరైనా లంచం అడిగితే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.