News January 1, 2026

జిల్లా వ్యవసాయాధికారిగా రాబర్ట్ పాల్ బాధ్యతలు

image

జిల్లా వ్యవసాయాధికారిగా కె. రాబర్ట్ పాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాధవరావు బుధవారం పదవీ విరమణ చేయడంతో, ఆత్మ ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉన్న రాబర్ట్ పాల్ ఇన్‌ఛార్జ్ ఏవోగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఏడీఏ సూర్య రమేశ్, ఏఈఓ సంఘం అధ్యక్షుడు వేణుమాధవ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా రాబర్ట్ పాల్ పేర్కొన్నారు.

Similar News

News April 20, 2026

కాయకవే కైలాస.. బసవన్న మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం!

image

బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం సంఘ సంస్కర్త బసవన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “కాయకవే కైలాస” అనే ఆయన బోధన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 20, 2026

దళారుల ఉచ్చులో పడకండి: DTO

image

తూ.గో (D) రవాణాశాఖ సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నట్లు DTO ఆర్. సురేశ్ సోమవారం తెలిపారు. లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని వినియోగదారులకు సూచించారు. సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఎవరైనా లంచం అడిగితే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.