News March 24, 2026
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యం: ఖమ్మం సీపీ

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడం, డ్రగ్స్ బారిన పడిన వారికి విముక్తి కలిగించడమే లక్ష్యమని సీపీ సునీల్ దత్ అన్నారు. పోలీస్ శాఖ, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ రావు, డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం గాంధీచౌక్‌లో స్థానిక ప్రజలకు యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
Similar News
News April 20, 2026
KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.