News February 26, 2025

తూ.గో: జిల్లాలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్లు 62,970

image

ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తూ.గో జిల్లాలో 62,970 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి మంగళవారం ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27న జరగనున్న ఎన్నికలకు 92 పోలింగ్ కేంద్రాలను 15 రూట్‌లలో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 36,366 మంది, స్త్రీలు 27,601 మంది ఇతరులు ముగ్గురు ఉన్నారన్నారు.

Similar News

News February 4, 2026

కడియం నర్సరీ అందాలకు హాలీవుడ్ ప్రముఖుడి ఫిదా..!

image

కడియం నర్సరీల అందాలకు హాలీవుడ్ ప్రముఖుడు డాన్ చో ముగ్ధులయ్యారు. దక్షిణ కొరియా బృందంతో కలిసి శ్రీ సత్యదేవ నర్సరీని సందర్శించిన ఆయన, త్వరలో 450 ఎకరాల్లో ఇండో-కొరియన్ నర్సరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొక్కల ఎగుమతిపై నర్సరీ రైతులతో చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో కడియం మొక్కలకు గుర్తింపు రావడం పట్ల నర్సరీ యజమానులు సంతోషం వ్యక్తం చేశారు.

News February 4, 2026

రాజానగరంలో మెగా జాబ్ మేళా.. గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

image

ఫిబ్రవరి 8న రాజానగరంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం దీనికి సంబంధించిన గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో టెక్నికల్, నాన్-టెక్నికల్ అభ్యర్థులు ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News February 4, 2026

పులిని పట్టుకోలేకపోవడం ప్రభుత్వ చేతగానితనమే: జక్కంపూడి రాజా

image

జిల్లాలో గత ఐదు రోజులుగా పులి సంచరిస్తున్నా, దానిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనవాసాల్లోకి పులి వచ్చి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలో అధికారులు సమర్థవంతంగా పనిచేసి పులిని అటవీ ప్రాంతంలోకి పంపించారని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.