News February 13, 2026

తొర్రూర్‌లో అత్తా కోడళ్లకు షాక్!

image

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఝాన్సీరెడ్డి అత్తా కోడళ్లకు ఓటర్లు షాక్ ఇచ్చారు. నియోజకవర్గ పరిధి తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో 16 వార్డులకు ఎన్నికలు జరుగగా బీఆర్‌ఎస్ 9 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ 7 స్థానాలు గెలిచింది. దీంతో ఈ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ ఖాతాలో చేరడం ఖాయంగా మారింది.

Similar News

News April 17, 2026

గుజరాత్‌తో పోరు.. కోల్‌‘కథ’ మారేనా?

image

IPLలో భాగంగా ఇవాళ గుజరాత్‌ టైటాన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచు(వర్షం వల్ల ఒకటి రద్దు)ల్లోనూ KKR ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నేటి పోరులో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు GT తొలి 2 మ్యాచుల్లో ఓడినా తర్వాత పుంజుకుని 2 గెలిచింది. కెప్టెన్ గిల్, బట్లర్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ ఫామ్‌లో ఉండటంతో ఇదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది.

News April 17, 2026

రెండేళ్లలో 5 వేల ఆలయాల నిర్మాణం: CBN

image

AP: శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గంలో 25-30 గుళ్లు నిర్మించే అవకాశం ఉందన్నారు. ‘సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్ధంగా ఉన్నాయి. మిగతా ఆలయాలకూ రూపొందించాలి. వీటి ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి’ అని దేవదాయ శాఖ సమీక్షలో సూచించారు.

News April 17, 2026

45 డిగ్రీలు.. వచ్చే 2 నెలలు ఎండలు తీవ్రం

image

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో 45 డిగ్రీలు దాటుతాయని, మే, జూన్‌లో ఎండలు మరింత తీవ్రమవుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది వేసవి సుదీర్ఘంగా ఉంటుందని చెబుతున్నారు. వాతావరణ మార్పులతో వర్షాలు కురిస్తే తప్ప హీట్ నుంచి ఉపశమనం లభించదని పేర్కొంటున్నారు. నిన్న APలోని 215 మండలాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.