News February 6, 2025

త్రివేణీ సంగమంలో నంద్యాల ఎంపీ పుణ్య స్నానం 

image

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఇక్కడ పవిత్ర స్నానం ఆచరించడం తన పూర్వ జన్మ సుకృతం అని ఆమె తెలిపారు. అక్కడ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఈ మహా కుంభమేళాకు జిల్లా నుంచి సైతం భక్తులు తరలివెళ్తున్నారు. 

Similar News

News February 6, 2025

ఇవాళ జగన్ ప్రెస్ మీట్

image

AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

News February 6, 2025

నాటోకు జెలెన్‌స్కీ అల్టిమేటం

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నాటో, పశ్చిమ దేశాలకు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. తమకు అణ్వాయుధాలో లేక నాటోలో సభ్యత్వమో ఏదొకటి త్వరగా తేల్చాలని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘ఓవైపు రష్యా మాపై దూకుడు పెంచుతుంటే మాకెందుకు నాటో సభ్యత్వం ఇవ్వడం లేదు? ఇప్పట్లో నాటో సభ్యత్వం ఇచ్చే ఆలోచన లేకపోతే వెంటనే అణ్వాయుధ క్షిపణుల్నైనా మాకు ఇవ్వాలి. మమ్మల్ని మేం రక్షించుకునేదెలా?’ అని ప్రశ్నించారు.

News February 6, 2025

పెద్దపల్లి: విషాదం.. కంటికి మోటార్ బోల్ట్ తగిలి వ్యక్తి మృతి

image

అంతర్గాం మండలం గోలివాడలోని కాళేశ్వర్వం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన పార్వతి పంప్-హౌస్ వద్ద బుధవారం దుర్ఘటన చోటుచేసుకుంది. జమ్మికుంటకు చెందిన మెగా కంపెనీ కార్మికుడు గుండబోయిన సంపత్(25) తన విధులు నిర్వహిస్తుండగా, మోటార్ పంపు బోల్ట్ ఎగిరి కంటికి తగిలింది. దీంతో తీవ్రగాయాలపాలైన అతడిని గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించాడు. మృతుడి స్వస్థలం వరంగల్‌లోని దామెర గ్రామం.

error: Content is protected !!