News February 6, 2025
నాటోకు జెలెన్‌స్కీ అల్టిమేటం

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నాటో, పశ్చిమ దేశాలకు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. తమకు అణ్వాయుధాలో లేక నాటోలో సభ్యత్వమో ఏదొకటి త్వరగా తేల్చాలని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘ఓవైపు రష్యా మాపై దూకుడు పెంచుతుంటే మాకెందుకు నాటో సభ్యత్వం ఇవ్వడం లేదు? ఇప్పట్లో నాటో సభ్యత్వం ఇచ్చే ఆలోచన లేకపోతే వెంటనే అణ్వాయుధ క్షిపణుల్నైనా మాకు ఇవ్వాలి. మమ్మల్ని మేం రక్షించుకునేదెలా?’ అని ప్రశ్నించారు.
Similar News
News February 13, 2026
గచ్చిబౌలిలో నోట్ల కట్టలతో పారిపోయాడు!

గచ్చిబౌలిలో పట్టపగలే నగదు చోరీ జరిగింది. గోపన్‌పల్లిలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన సీఎంఎస్ వాహన డ్రైవర్ అజిత్ అలియాస్ శివ రూ.57 లక్షల నగదుతో పరారీ అయ్యాడు. కస్టోడియన్లు బ్యాంక్‌లో ఉండగా సెక్యూరిటీ గార్డు బయటకు వెళ్లిన సమయం చూసి చోరీ చేశాడు. వాహనాన్ని తెల్లాపూర్ వద్ద వదిలేసి నగదుతో నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
News February 12, 2026
రేపు వైన్ షాపులు బంద్

TG: రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉ.6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకూ మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రేపు ఉ.8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
News February 12, 2026
85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్!

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు మందగించింది. ఆయన కుడి కన్ను 85% విజన్ కోల్పోయిందని సుప్రీంకోర్టు నియమించిన లాయర్ తెలిపారు. 3 నెలలుగా కంటిచూపు సమస్యతో బాధపడుతున్నా జైలు అధికారులు చికిత్స అందించడం లేదని కోర్టుకు రిపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఆరోగ్యంపై మెడికల్ రివ్యూకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఇమ్రాన్ 2023 AUG నుంచి జైలులోనే ఉన్నారు.


