News March 13, 2025

దేవీపట్నం: పెళ్లి రోజే ఆమెకు చివరిరోజు 

image

దేవీపట్నం మండలం దేవారం గ్రామానికి చెందిన కె. శ్రీదేవి(45) పెళ్లిరోజే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. శ్రీదేవి అటవీ శాఖలో బీట్ ఆఫీసర్‌గా పని చేస్తూ కృష్ణునిపాలెంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. బుధవారం 25వ మ్యారేజ్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబ సభ్యులు గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News March 13, 2025

ఒంటిపూట బడులు.. ఉత్తర్వులు జారీ

image

తెలంగాణలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉ.8 నుంచి మ.12.30 గంటల వరకు స్కూళ్లు నడవనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో ఒంటి గంట నుంచి సా.5 వరకు తరగతులు నిర్వహిస్తారు. అటు ఏపీలోనూ ఎల్లుండి నుంచి ఒంటిపూట స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.

News March 13, 2025

మహిళలతో తప్పుడు ప్రవర్తన.. చెంప చెళ్లుమనిపించా: హీరో

image

మహిళలతో తప్పుగా ప్రవర్తించిన ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించానని హిందీ నటుడు గోవిందా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘2008లో సంతోష్ అనే అభిమాని నా కోసం సెట్స్‌కు వచ్చాడు. అతడు మహిళలతో తప్పుగా ప్రవర్తించడం చూసి చెంప మీద కొట్టాను. దీంతో అతడు నాపై కేసు పెట్టాడు. 9ఏళ్లపాటు ఆ కేసు సాగింది. ఎట్టకేలకు అతడిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఆధారాలు సంపాదించి కేసు గెలిచాను’ అని తెలిపారు.

News March 13, 2025

ఇతరులకు ఇబ్బంది లేకుండా హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

image

హోలీ పండుగను ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రజలకు సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలను ప్రేరేపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

error: Content is protected !!