News March 13, 2025

మహిళలతో తప్పుడు ప్రవర్తన.. చెంప చెళ్లుమనిపించా: హీరో

image

మహిళలతో తప్పుగా ప్రవర్తించిన ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించానని హిందీ నటుడు గోవిందా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘2008లో సంతోష్ అనే అభిమాని నా కోసం సెట్స్‌కు వచ్చాడు. అతడు మహిళలతో తప్పుగా ప్రవర్తించడం చూసి చెంప మీద కొట్టాను. దీంతో అతడు నాపై కేసు పెట్టాడు. 9ఏళ్లపాటు ఆ కేసు సాగింది. ఎట్టకేలకు అతడిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఆధారాలు సంపాదించి కేసు గెలిచాను’ అని తెలిపారు.

Similar News

News February 11, 2026

తిరుమల కొండపై పూలు ఎందుకు ధరించరు?

image

శ్రీవారు అలంకార ప్రియుడు. కొండపై పూసే ప్రతి పువ్వు స్వామివారికే చెందాలనేది భక్తుల విశ్వాసం. పూర్వం ఓ శిష్యుడు దేవుడికి అర్పించాల్సిన పూలను తాను ధరించాడు. అలా ‘పరిమళ ద్రోహం’ చేసినట్లు పురాణ గాథ. అందుకే, అప్పటి నుంచి భక్తులు కొండపై పూలు పెట్టుకోకూడదనే నియమం వచ్చింది. స్వామికి అలంకరించిన పూలను కూడా ఇతరులకు ఇవ్వకుండా పవిత్రమైన బావిలోనే వేస్తారు. ఈ నియమం పాటించడం స్వామివారిపై ఉన్న భక్తికి నిదర్శనం.

News February 11, 2026

RRBలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల

image

<>రైల్వే <<>>రిక్రూట్‌మెంట్ బోర్డ్ JE/DMS/CMA పోస్టుల పరీక్ష(CBT-1)కు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల చేసింది. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి పరీక్ష నగరాన్ని తెలుసుకోవచ్చు. ఫిబ్రవరి 19, 20, 25 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు 4రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేయనుంది. RRB 2585 పోస్టులకు భర్తీ చేయనుంది. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in

News February 11, 2026

కోళ్లకు వ్యాధుల ముప్పు తగ్గాలంటే?

image

ఏదైనా కోడిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మిగిలిన కోళ్ల నుంచి దాన్ని వేరుచేయాలి. వ్యాధితో ఏదైనా కోడి చనిపోతే దాన్ని దూరంగా లోతైన గుంతలో పూడ్చిపెట్టాలి లేదా కాల్చేయాలి. కోళ్ల షెడ్డులోకి వెళ్లేవారు నిపుణులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కాళ్లు కడుక్కున్న తర్వాతే వెళ్లాలి. కోడికి మేతపెట్టే తొట్టెలు, నీటితొట్టెలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్డులో లిట్టరును గమనిస్తూ అవసరమైతే మారుస్తుండాలి.