News April 4, 2025
నంద్యాలలో ఈనెల 10న జాబ్ మేళా

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 14 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, B.Tech (Mechanical), B/D/M.Pharmacy, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు.
Similar News
News April 10, 2025
మెదక్: కొడుకు పెళ్లి.. అంతలోనే విషాదం

మెదక్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. కుమారుడి పెళ్లి అయిన గంట వ్యవధిలో తల్లి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలం సూరారంలో జరిగింది. గ్రామంలో మల్కాని నరసమ్మ(48) కొడుకు రవీందర్ పెళ్లి బుధవారం జరిగింది. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. పెళ్లైన గంట వ్యవధిలో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకవైపు శుభకార్యం.. మరొకవైపు చావు కబురు ఆ కుటుంబాన్ని కలచివేసింది.
News April 10, 2025
RR జట్టుకు బిగ్ షాక్

GTతో మ్యాచ్‌లో ఓటమి బాధలో ఉన్న RR ఆటగాళ్లకు IPL యాజమాన్యం షాకిచ్చింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందుకు కెప్టెన్ సంజూ శాంసన్‌కు రూ.24 లక్షల జరిమానా విధించింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ సహా టీమ్‌లోని ప్రతి ఆటగాడు రూ.6 లక్షల చొప్పున ఫైన్ లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కట్టాలని ఆదేశించింది. ఇందులో ఏది తక్కువ ఉంటే ఆ మొత్తం వర్తిస్తుందని పేర్కొంది.
News April 10, 2025
మెగాస్టార్ ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తోన్న ‘విశ్వంభర’ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈనెల 12న హనుమాన్ జయంతి సందర్భంగా ఫస్ట్ సింగిల్ ‘రామ రామ’ పాటను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.