News April 10, 2025
RR జట్టుకు బిగ్ షాక్

GTతో మ్యాచ్‌లో ఓటమి బాధలో ఉన్న RR ఆటగాళ్లకు IPL యాజమాన్యం షాకిచ్చింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందుకు కెప్టెన్ సంజూ శాంసన్‌కు రూ.24 లక్షల జరిమానా విధించింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ సహా టీమ్‌లోని ప్రతి ఆటగాడు రూ.6 లక్షల చొప్పున ఫైన్ లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కట్టాలని ఆదేశించింది. ఇందులో ఏది తక్కువ ఉంటే ఆ మొత్తం వర్తిస్తుందని పేర్కొంది.
Similar News
News April 11, 2026
గుడికెళ్లి, దేవుడిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందా?

ఆలయాలకు వెళ్లడం అంటే కేవలం దేవుడిని చూడటం కాదు. విగ్రహారాధనలోని రహస్యాన్ని, దర్శనం పరమార్థాన్ని తెలుసుకోవాలి. భగవంతుని గొప్ప లీలలు, గుణాలను మనసులో తలుచుకోవాలి. ఆయనే మనకు శరణం అని గుర్తించాలి. నిరంతరం ఆయనపై ధ్యానం ఉంచుతూ, ఆయనకు నచ్చిన మంచి పనులు చేయాలి. కేవలం దర్శనం కాకుండా, ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మనం జీవితంలో మోక్షాన్ని సాధించగలం.
News April 11, 2026
అన్నింటా ఉన్నవాడే ‘వేంకటేశ్వరుడు’

సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః|
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః||
దేవతలకు అధిపతి, మనందరికీ శరణమిచ్చేవాడు, సహనశీలుడు, విశ్వానికి బీజము, జీవుల సృష్టికి కారణము వేంకటేశ్వరుడే. దినం, సంవత్సరం, సర్పం కూడా ఆయనే. విశ్వాసానికి మూలంగా, సమస్తాన్ని చూడగలిగే సర్వదర్శనుడిగా ఆయన సృష్టి, కాలం, రక్షణ, జ్ఞాన రూపాలలో అన్నింటా ఉంటాడు. అయన దర్శనం ముక్తికి మార్గం.
News April 11, 2026
వెనక్కి తగ్గిన నువాన్ తుషార

IPLలో ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు NOC ఇవ్వట్లేదని కోర్టుకెక్కిన నువాన్ తుషార వెనకడుగు వేశారు. కేసును వెనక్కి తీసుకోవడంతో పాటు బోర్డుకు సారీ చెప్పారు. గవర్నింగ్ బాడీని ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని మెయిల్ పంపారు. బోర్డు తన పట్ల పారదర్శకంగా వ్యవహరించలేదని, న్యాయం కోసం అలా చేశానని పేర్కొన్నారు. SL బోర్డు NOC ఇవ్వకపోవడంతో RCBకి ప్రాతినిధ్యం వహించాల్సిన తుషార ఇంకా జట్టులో జాయిన్ కాలేదు.


