News February 8, 2025
నంద్యాల జిల్లా ఎస్పీ కీలక సూచన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738942496565_52069588-normal-WIFI.webp)
వాలంటైన్స్ డే సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రజలకు కీలక సూచన చేశారు. ఆఫర్స్ పేరుతో వచ్చే బహుమతులపై జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ మోసగాళ్లు వాలెంటైన్స్ డే కోసం బహుతులు అంటూ నకిలీ లింకులు పంపిస్తారని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తెలియని లింకులు క్లిక్ చేయొద్దని అన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News February 8, 2025
1956-93 మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎందుకు లేదు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738981085860_695-normal-WIFI.webp)
1952లో ఢిల్లీకి తొలి ఎన్నికలు జరిగాయి. 1956 నుంచి 93 వరకు అసెంబ్లీ మనుగడలో లేదు. 1956 NOV 1న అమల్లోకి వచ్చిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఢిల్లీ రాష్ట్ర హోదా కోల్పోయి UTగా మారింది. ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం వచ్చింది. 56 ఎలెక్టెడ్, LG నామినేటెడ్ మెంబర్స్ ఐదుగురు ఉండేవారు. అయితే వీరికి శాసనాధికారాలు లేవు. 1991లో 69వ సవరణ ద్వారా అసెంబ్లీ మళ్లీ మనుగడలోకి వచ్చింది.
News February 8, 2025
వికారాబాద్: ఉరేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738982031498_20512937-normal-WIFI.webp)
ఉరేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. సీఐ భీమ్ కుమార్ తెలిపిన వివరాలు.. కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్ వాసి సత్యనారాయణ వికారాబాద్‌లోని గాంధీ కాలేజీ వద్ద అద్దెకు ఉంటున్నారు. ఆయన కూతురు జ్యోతి(21) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కుటుంబీకులు ఊరెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో జ్యోతి ఉరేసుకుని చనిపోయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 8, 2025
వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738983975481_1292-normal-WIFI.webp)
ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.