News February 8, 2025

1956-93 మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎందుకు లేదు?

image

1952లో ఢిల్లీకి తొలి ఎన్నికలు జరిగాయి. 1956 నుంచి 93 వరకు అసెంబ్లీ మనుగడలో లేదు. 1956 NOV 1న అమల్లోకి వచ్చిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఢిల్లీ రాష్ట్ర హోదా కోల్పోయి UTగా మారింది. ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం వచ్చింది. 56 ఎలెక్టెడ్, LG నామినేటెడ్ మెంబర్స్ ఐదుగురు ఉండేవారు. అయితే వీరికి శాసనాధికారాలు లేవు. 1991లో 69వ సవరణ ద్వారా అసెంబ్లీ మళ్లీ మనుగడలోకి వచ్చింది.

Similar News

News April 10, 2026

ఫిట్‌గా ఉంటే హెల్తీగా ఉన్నట్లేనా?

image

చాలామంది ఫిట్‌గా ఉంటే హెల్తీగా ఉన్నట్లే అనుకుంటారు. కానీ రెండూ వేరు. హెల్త్ మన శరీరం లోపల అవయవాలు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. మంచి నిద్ర, బ్యాలెన్స్‌డ్ ఫుడ్, తక్కువ స్ట్రెస్ ఉంటే హెల్తీగా ఉన్నట్లు లెక్క. మరోవైపు ఫిట్‌నెస్ అంటే శారీరక సామర్థ్యం. బరువులు ఎత్తడం, వేగంగా పరుగెత్తడం వంటివి ఫిట్‌నెస్‌ను సూచిస్తాయి. ఒక బాడీబిల్డర్ చూడటానికి చాలా ఫిట్‌గా ఉన్నా లోపల హెల్తీగా లేకపోవచ్చు.

News April 10, 2026

జాబ్ ఆఫర్ చేసిన MNC.. షాక్ ఇచ్చిన అభ్యర్థి

image

జాబ్ ఆఫర్ చేసిన కంపెనీకే షాక్ ఇచ్చాడు కన్సల్టెంటుగా పనిచేసిన ఓ అభ్యర్థి. ‘ఓ MNCలో అన్నీ అధ్వానంగా ఉంటాయి. నా CVకి సరిపోయే జాబ్ ఉందని ఆ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. కానీ వాళ్ల సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టానని, అందులో పని చేయనని చెప్పేశా. ఇవి పిల్ల చేష్టలని అనుకోవచ్చు. కానీ అదెంతో అద్భుతంగా, సంతృప్తిగా అనిపించింది. మళ్లీ సంప్రదిస్తే CEO ఏడ్చేలా ఈ-మెయిల్ పంపుతా’ అని రెడిట్‌లో రాసుకొచ్చారు.

News April 10, 2026

యుద్ధం.. శాంతి చర్చలకు పాక్ బయల్దేరిన జేడీ వాన్స్

image

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్‌తో శాంతి చర్చల్లో పాల్గొనేందుకు కాసేపటి క్రితమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్‌కు బయల్దేరారు. ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు భేటీ కానున్నారు. చర్చల ఫలితాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో 2 రోజులు లాక్‌డౌన్ విధించారు.