News August 22, 2025
నంద్యాల: రక్తంతో చిరంజీవి చిత్రం

నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసులు రక్తంతో చిరంజీవి చిత్రాన్ని గీశారు. ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించు చిత్రాన్ని గీశానని తెలిపారు. సినీ పరిశ్రమలో చిరంజీవిగా ప్రాణం ఖరీదు సినిమాతో ప్రారంభించారని తెలిపారు. విశ్వంభర చిత్రం చేస్తూ డాన్సులు, ఫైట్లతో నటనలో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.
Similar News
News August 22, 2025
పెద్దారెడ్డి రాక.. ఇక కష్టమేనా?

కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి ఇప్పట్లో రావడం కష్టమేనన్న అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు ఉత్తర్వులతో ఆయన ఆశలు నీరుగారగ, పెద్దారెడ్డిని తాడిపత్రికి దూరం చేయడమే జేసీ లక్ష్యంగా కనిపిస్తోంది. దశాబ్దాల JC కుటుంబ రాజకీయ ఆధిపత్యానికి పెద్దారెడ్డి రాకతో 2019లో గండిపడింది. ఈ క్రమంలో పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రికి రానీయకూడదన్న ఆలోచన ప్రభాకర్‌రెడ్డిలో ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.
News August 22, 2025
ఇవాళ స్కూళ్లు, కాలేజీలూ బందేనా?

మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ <<17479279>>బంద్‌కు<<>> ఓయూ జేఏసీ పిలుపునివ్వడంతో పలు ప్రాంతాల్లో షాపులు మూతబడనున్నాయి. బంద్‌కు వ్యాపారులు స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నారు. వాణిజ్యానికి సంబంధించిన అంశం కాబట్టి స్కూళ్లు, కాలేజీలపై ప్రభావం చూపే అవకాశం లేదు. నేడు స్కూళ్లకు సెలవు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు రాలేదని తెలుస్తోంది. మరి మీకేమైనా హాలిడే అని మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.
News August 22, 2025
సూర్యాపేట: ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమానికి మద్దతు

మార్వాడీ సంస్కృతికి వ్యతిరేకంగా మేళ్లచెరువులో చేపట్టిన బంద్‌కు ఎలక్ట్రిషియన్, ప్లంబర్, హార్డ్‌వేర్, సానిటేషన్ వ్యాపార సంఘాలు మద్దతు తెలిపాయి. ‘మార్వాడీ హటావో, తెలంగాణ బచావో’ నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించి, ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సంఘాల సభ్యులు ప్రకటించారు. ఈ ఉద్యమానికి స్థానికంగా మద్దతు పెరుగుతోంది.