News March 14, 2025
నంద్యాల: హత్యాయత్నం కేసులో ఇద్దరికి 7ఏళ్ల జైలు శిక్ష

హత్యాయత్నం కేసులో ఇద్దరికి 7ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.11వేల జరిమానా విధిస్తూ నంద్యాల జిల్లా కోర్టు న్యాయమూర్తి రాధారాణి తీర్పు చెప్పారు. తమ్మరాజుపల్లె గ్రామంలో 2017లో శివమ్మ అనే మహిళపై హత్యాయత్నం జరిగింది. తన అక్రమ సంబంధం తెలిసిందనే కారణంతో కోడలు ప్రియుడితో కలిసి ఈ ఘటనకు పాల్పడింది. అత్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితులకు శిక్ష పడింది.
Similar News
News March 14, 2025
నటన వదిలేద్దామనుకున్నా.. నాన్న ఆపారు: అభిషేక్ బచ్చన్

దిగ్గజ నటుడైన అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అభిషేక్ బచ్చన్ కెరీర్ తొలినాళ్లలో వరసగా 12కు పైగా ఫ్లాపుల్ని చవిచూశారు. ఆ సమయంలో సినిమాల్ని వదిలేయాలని తాను భావించినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ‘ఓరోజు నాన్నతో నా బాధ చెప్పాను. ఈ రంగం వదిలేస్తానన్నాను. కానీ నాన్న నన్ను వారించారు. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నానని, పోరాటం ఆపొద్దని చెప్పి నాలో స్ఫూర్తి నింపారు’ అని వెల్లడించారు.
News March 14, 2025
NGKL: జిల్లాలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు..

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మార్చ్ నెల మొదటి వారంలోని ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో గడిచిన 24 గంటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్వకుర్తి ప్రాంతంలో శుక్రవారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకున్నాయి.
News March 14, 2025
స్టార్ క్రికెటర్ కూతురు మృతి

అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండేళ్ల కూతురు మరణించినట్లు అఫ్గాన్ జట్టు ఆటగాడు కరీం జనత్ ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. చిన్నారి ఫొటోను షేర్ చేశారు. అయితే ఆమె ఎలా మరణించిందనేది తెలియరాలేదు. స్టార్ హిట్టర్‌గా పేరొందిన జజాయ్ T20ల్లో 6 బంతులకు 6 సిక్సర్లు బాదడం, ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(12 బంతుల్లో) చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరారు.