News March 14, 2025
స్టార్ క్రికెటర్ కూతురు మృతి

అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండేళ్ల కూతురు మరణించినట్లు అఫ్గాన్ జట్టు ఆటగాడు కరీం జనత్ ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. చిన్నారి ఫొటోను షేర్ చేశారు. అయితే ఆమె ఎలా మరణించిందనేది తెలియరాలేదు. స్టార్ హిట్టర్‌గా పేరొందిన జజాయ్ T20ల్లో 6 బంతులకు 6 సిక్సర్లు బాదడం, ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(12 బంతుల్లో) చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరారు.
Similar News
News April 23, 2025
ముగిసిన SRH ఇన్నింగ్స్.. స్కోర్ ఎంతంటే?

ముంబైతో జరుగుతున్న మ్యాచులో హైదరాబాద్ ఓ మాదిరి స్కోరు చేసింది. టాపార్డర్ వైఫల్యంతో ఓవర్లన్నీ ఆడి 143/8 స్కోర్ నమోదు చేసింది. క్లాసెన్ (71) ఒంటరి పోరాటం చేశారు. జట్టు 35/5తో కష్టాల్లో ఉన్న దశలో క్లాసెన్ క్రీజులోకి వచ్చి ఆదుకున్నారు. అతడికి అభినవ్ (43) సహకారం అందించారు. హెడ్ (0), అభిషేక్ (8), ఇషాన్ (1), నితీశ్ (2) ఘోరంగా విఫలమయ్యారు. బౌల్ట్ 4, చాహర్ 2 వికెట్లు తీశారు.
News April 23, 2025
కాసేపట్లో కేంద్ర హోంశాఖ ప్రెస్ మీట్

పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర క్యాబినేట్ భేటీ ముగిసింది. PM మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. దాదాపు 2గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉగ్రవాదుల ఏరివేత, తదితరాలపై చర్చించారు. మరోవైపు, కేంద్ర హోంశాఖ కాసేపట్లో ఈ భేటీపై ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఉగ్రవాదుల సమాచారం తెలిపిన వారికి రూ.20లక్షల నజరానా అందిస్తామని అనంతనాగ్ పోలీసులు తెలిపారు.
News April 23, 2025
RED ALERT: మూడు రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులపాటు తీవ్ర వడగాలులతోపాటు ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఎల్లుండి పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.