News April 1, 2026

నన్నయ వర్సిటీ స్టూడెంట్స్‌కు అలర్ట్.. కొత్త కోర్స్ వచ్చేసింది!

image

నన్నయ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో “మాట్రిక్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్” బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య ఎస్.ప్రసన్న శ్రీ తెలిపారు. బుధవారం దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. వర్సిటీలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరికీ ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. విద్యార్థుల గణిత పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.

Similar News

News April 20, 2026

కాయకవే కైలాస.. బసవన్న మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం!

image

బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం సంఘ సంస్కర్త బసవన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “కాయకవే కైలాస” అనే ఆయన బోధన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 20, 2026

దళారుల ఉచ్చులో పడకండి: DTO

image

తూ.గో (D) రవాణాశాఖ సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నట్లు DTO ఆర్. సురేశ్ సోమవారం తెలిపారు. లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని వినియోగదారులకు సూచించారు. సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఎవరైనా లంచం అడిగితే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.