News July 26, 2024
నల్గొండ: కూలీలతో కలిసి నాటు వేసిన ఎమ్మెల్యే

విమర్శలు, ప్రతీ విమర్శలు, నియోజకవర్గ అభివృద్ధి పనులంటూ బిజీగా ఉండే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూలీలతో మమేకయ్యారు. వారితో కలిసి నాటు వేశారు. రుణమాఫీ అయిందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తమతో కలిసి నాట్లు వేయడం సంతోషంగా ఉందని కూలీలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని బీఎల్ఆర్ తెలిపారు.
Similar News
News February 13, 2026
మిర్యాలగూడలో ఒక్క ఓటుతో విజయం

మిర్యాలగూడ 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు సంచలన విజయం సాధించారు. అత్యంత హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో సైదులుకు 837 ఓట్లు రాగా, సమీప బీఆర్ఎస్ అభ్యర్థికి 836 ఓట్లు పోలయ్యాయి. కేవలం ఒక్క ఓటు మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఈ ఉత్కంఠ విజయంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వార్డు అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటానని సైదులు కృతజ్ఞతలు తెలిపారు.
News February 13, 2026
దేవరకొండ: మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 20 వార్డులకు గాను 11 స్థానాలను గెలుచుకుని, స్పష్టమైన మెజార్టీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 6 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ కేవలం ఒక వార్డులో మాత్రమే విజయం సాధించింది. ఓటర్లు మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో పట్టణంలో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
News February 13, 2026
NLG: మున్సిపల్ ఫలితాలు.. మధ్యాహ్నానికే స్పష్టత!

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో సహా జిల్లాలో ఆరు మున్సిపాలిటీలలో ఎన్నికల ఫలితాలు ఉదయం 8గంటలకు ప్రారంభమై11:30 వరకు పూర్తయ్యే అవకాశముంది. దేవరకొండ, చండూరు, చిట్యాల, నందికొండ, హాలియాలో 20 వార్డులలోపే ఉండడంతో లెక్కింపు ప్రారంభమైన 2 గంటల వ్యవధిలోనే వీటి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ మున్సిపాలిటీ కౌంటింగ్ తుది ఫలితాలు ఉదయం 11:30 గంటలకు వెలువడనున్నాయి.


