News February 13, 2026
మిర్యాలగూడలో ఒక్క ఓటుతో విజయం

మిర్యాలగూడ 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు సంచలన విజయం సాధించారు. అత్యంత హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో సైదులుకు 837 ఓట్లు రాగా, సమీప బీఆర్ఎస్ అభ్యర్థికి 836 ఓట్లు పోలయ్యాయి. కేవలం ఒక్క ఓటు మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఈ ఉత్కంఠ విజయంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వార్డు అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటానని సైదులు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News April 20, 2026
NLG: పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

వంగమర్తి గ్రామ కార్యదర్శి దేవేందర్ తనను వేధిస్తున్నాడని బాధితుడు భూత్కూరు వెంకటరెడ్డి సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇంటికి సంబంధించిన యాజమాన్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, కార్యదర్శి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, ఇబ్బందులకు గురిచేస్తున్న కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.

NLG: రైతులకు గుడ్ న్యూస్.. నేడు రెండో విడత భరోసా…

జిల్లాలో రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు రెండో విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఎకరాల వారీగా రైతులకు సాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనున్నది.