News April 4, 2024

నల్గొండ: రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

image

కేతేపల్లి మండలం ఇనుపాముల స్టేజి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై శివతేజ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన అమనగంటి ఎల్లమ్మ మృతిచెందగా, ఆనంతమ్మ , భారతమ్మ, పూలమ్మ, ఎల్లయ్య గాయపడ్డారు.

Similar News

News February 13, 2026

మిర్యాలగూడలో ఒక్క ఓటుతో విజయం

image

మిర్యాలగూడ 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు సంచలన విజయం సాధించారు. అత్యంత హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో సైదులుకు 837 ఓట్లు రాగా, సమీప బీఆర్ఎస్ అభ్యర్థికి 836 ఓట్లు పోలయ్యాయి. కేవలం ఒక్క ఓటు మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఈ ఉత్కంఠ విజయంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వార్డు అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటానని సైదులు కృతజ్ఞతలు తెలిపారు.

News February 13, 2026

దేవరకొండ: మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

image

దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 20 వార్డులకు గాను 11 స్థానాలను గెలుచుకుని, స్పష్టమైన మెజార్టీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 6 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ కేవలం ఒక వార్డులో మాత్రమే విజయం సాధించింది. ఓటర్లు మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో పట్టణంలో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

News February 13, 2026

NLG: మున్సిపల్ ఫలితాలు.. మధ్యాహ్నానికే స్పష్టత!

image

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో సహా జిల్లాలో ఆరు మున్సిపాలిటీలలో ఎన్నికల ఫలితాలు ఉదయం 8గంటలకు ప్రారంభమై11:30 వరకు పూర్తయ్యే అవకాశముంది. దేవరకొండ, చండూరు, చిట్యాల, నందికొండ, హాలియాలో 20 వార్డులలోపే ఉండడంతో లెక్కింపు ప్రారంభమైన 2 గంటల వ్యవధిలోనే వీటి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ మున్సిపాలిటీ కౌంటింగ్ తుది ఫలితాలు ఉదయం 11:30 గంటలకు వెలువడనున్నాయి.