News September 13, 2025
నిండుకుండల శ్రీరామ్ సాగర్

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. శనివారం ఉదయం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు (80.501 టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి భారీగా 1,08,855 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 23 గేట్లు ఎత్తి 91,140 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ఐఎఫ్‌ఎఫ్‌సీ, ఎస్కేప్ గేట్లు, సరస్వతి కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు.
Similar News
News September 13, 2025
ఖమ్మం జిల్లాలో 15 నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల బంద్

ఖమ్మం జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పాటించనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రైవేటు విద్యాసంస్థల బాధ్యులు మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బకాయిలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
News September 13, 2025
రేపే దాయాదుల పోరు.. సగం టికెట్లే సేల్!

UAEలో జరుగుతోన్న ఆసియా కప్‌పై భారత అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా రేపు జరిగే ఇండియా VS పాకిస్థాన్‌ను బైకాట్ చేయాలంటూ భారత అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీంతో హాట్ కేకుల్లా అమ్ముడవ్వాల్సిన దాయాదుల మ్యాచ్ టికెట్లు ఇప్పటికీ సగం కూడా అమ్ముడవలేదని సమాచారం. అమ్మకాలను పెంచేందుకు నిర్వాహకులు టికెట్ ధరలు కూడా తగ్గించారట. రోహిత్, కోహ్లీ వంటి స్టార్లు లేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది.
News September 13, 2025
నిద్రలోనే చనిపోయిన 19 మంది స్టూడెంట్స్

మయన్మార్‌లో అంతర్గత ఘర్షణలకు 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి రఖై రాష్ట్రంలోని క్యాక్తాలో రెండు ప్రైవేట్ స్కూళ్లపై డ్రోన్ల దాడి జరగడంతో 19 మంది స్టూడెంట్స్ నిద్రలోనే కన్నుమూశారు. 22 మంది గాయపడినట్లు అరాకన్ ఆర్మీ తెలిపింది. డ్రోన్లతో బాంబులను జారవిడిచారని, ఇది మయన్మార్ మిలిటరీ పనేనని ఆరోపించింది. కాగా కొన్నాళ్లుగా అరాకన్ ఆర్మీ, మయన్మార్ మిలిటరీ మధ్య ఘర్షణ జరుగుతోంది.