News January 17, 2026

నిజామాబాద్: మోడల్ స్కూల్స్‌లో అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల

image

తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, 7- 10 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. JAN 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. హాల్ టికెట్లు ఏప్రిల్ 9 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. వివరాల కోసం https://tgms.telangana.gov.inలో సంప్రదించాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News April 20, 2026

నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

image

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News April 20, 2026

బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

image

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.