News April 11, 2025

నిర్మల్ జిల్లాలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భైంసా పట్టణం గోపాల్‌నగర్‌కు చెందిన బోయిడోళ్ల రాజు (32) వానల్పాడ్ నుంచి నడుచుకుంటూ తిమ్మాపూర్ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News April 15, 2026

తిరుమల మాడవీధులకు వేదాల పేర్లు

image

AP: తిరుమలలోని ముఖ్యమైన స్థలాలు, మార్గాలకు ఆధ్యాత్మికత చేకూరేలా పేర్లు పెట్టాలని TTD భావిస్తోంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న 4 మాడవీధులకు 4 వేదాల పేర్లు(రుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణవేద) పెట్టాలని నిర్ణయించింది. శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు రోడ్డుపైకి వచ్చే ప్రాంతానికి శ్రీకృష్ణదేవరాయ మార్గం పేరును పెట్టనుంది. ఇతర మార్గాలకు గరుడాద్రి, పద్మావతి, ఆళ్వార్లు పేర్లను పరిశీలిస్తోంది.

News April 15, 2026

దేవరకొండ: SBI బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిపై కేసు నమోదు

image

దేవరకొండ SBI బ్యాంకులో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగి చక్రపాణిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని పలు శాఖలలో లావాదేవీలు నిర్వహించని బ్యాంకు ఖాతాల నుంచి చక్రపాణి తన ఖాతాలోకి రూ.2.65 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. బ్యాంకు ఖాతాదారుని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిబ్బంది 89 లక్షల రూపాయలు రికవరీ చేశారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో చక్రపాణిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News April 15, 2026

శబరిమల: 18 మెట్లు దేనిని సూచిస్తాయంటే?

image

పదునెట్టాంబడిలో మొదటి 5 మెట్లు మనిషిలోని పంచేంద్రియాలను సూచిస్తాయి. వీటిని అదుపులో ఉంచుకుని మందుకు సాగాలనే సారాంశాన్ని అందిస్తాయి. తర్వాత వచ్చే 8 మెట్లు కామం, కోపం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, ద్వేషం అనే 8 రాగద్వేషాలను సూచిస్తాయి. వాటిని వదిలి మంచి మార్గంలో నడవాలని చెబుతాయి. ఆ తర్వాత 3 మెట్లు సత్వ, రజో, తమో అనే త్రిగుణాలకు ప్రతీక. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలకు ప్రతీక.