News August 11, 2025
నిర్మల్: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికలు

నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సీనియర్ బాలబాలికల ఎంపిక పోటీలను సోమవారం నిర్వహించారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఆదిలాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా SGF సెక్రటరీ రవీందర్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ సెక్రటరీ అన్నపూర్ణ, PET శ్రీనివాస్, ఆర్గనైజర్ సంజీవ్ పాల్గొన్నారు.
Similar News
News April 16, 2026
TCS నాసిక్ క్యాంపస్‌లో BPO బిజినెస్ బంద్

తమ నాసిక్ క్యాంపస్‌లో BPO కార్యకలాపాలను TCS తాత్కాలికంగా నిలిపివేసింది. లైంగిక ఆరోపణలు, మత మార్పిడి <<19633913>>ఆరోపణల<<>> నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తర్వాతి నోటీస్ ఇచ్చే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కంపెనీ అక్కడి ఉద్యోగులకు సూచించింది. ఇప్పటి వరకు ఈ కేసులో 9 FIRలు నమోదు చేసి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News April 16, 2026
సిరికొండ: ప్రజా సమస్యల పరిష్కారంపై సమీక్ష

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సిరికొండ మండలంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎవరైతే జిల్లా నాయకులు, మండల రైతులు ప్రజలు, సర్పంచులు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.
News April 16, 2026
1,000 బ్యాంక్ ఉద్యోగాలు.. 4 రోజులే గడువు

పంజాబ్&సింధ్ బ్యాంకులో 1,000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాల దరఖాస్తు గడువు ఈనెల 20తో ముగియనుంది. TGలో 30 పోస్టులున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా బ్యాంకులో 18 నెలల పని చేసిన అనుభవం ఉండాలి. సంబంధిత రాష్ట్రంలోని లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. వయసు 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం punjabandsind.bank.in చూడండి.


