News April 19, 2026

నిర్మల్: 23న బడుల్లో తల్లిదండ్రుల సమావేశం

image

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 23న తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) నిర్వహించాలని డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ భేటీ జరుగుతుంది. విద్యార్థుల విద్యా పురోగతి, పరీక్షా ఫలితాలపై చర్చించి ప్రగతి పత్రాలను అందజేస్తారు. వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని, తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ కోరింది.

Similar News

News April 19, 2026

కొత్తపట్నం బీచ్‌లో మృతదేహం.. పచ్చబొట్టే ఆదారం

image

కొత్తపట్నం మండలం పిన్నివారిపాలెం బీచ్ వద్ద ఆదివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానిక మత్స్యకారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఎవరైనా చంపి అక్కడ పడేశారా..? లేక ఆమె ఆత్మహత్య చేసుకున్నారా..? అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె చేతిపై P.ఎల్లమ్మ అనే పచ్చబొట్టు ఉంది.

News April 19, 2026

ఆన్‌లైన్‌లో PGRS అర్జీలు సమర్పించవచ్చు: కలెక్టర్

image

గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా సమర్పించవచ్చని అన్నారు. 1100 టోల్ ఫ్రీ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News April 19, 2026

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై చిరంజీవి అప్‌డేట్

image

తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘కళ్యాణ్ బాబుకు విజయవంతంగా <<19685329>>సర్జరీ<<>> జరిగింది. ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. కోలుకుంటున్నారు. సాధారణ స్థితికి వచ్చేందుకు వారం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆందోళన చెందాల్సిన పని లేదు. పవన్ కోలుకోవాలని ప్రార్థించిన, ప్రేమ చూపించిన వారందరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.