News April 7, 2026
నీటిని సంరక్షించాలి: కలెక్టర్, ఎమ్మెల్యే

నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే థామస్ కోరారు. జీడీ నెల్లూరు మండలం వేపంజేరిలో జల ధార, నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో సోమవారం వారు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వందరోజుల యాక్షన్ ప్లాన్ వివరాలను వివరించారు. నీటి భద్రతా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.
Similar News
News April 19, 2026
చిత్తూరు: కాలేజీలో కూలిన మెస్ భవనం!

చిత్తూరులో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరులోని ఓ కళాశాలలో నూతనంగా నిర్మించిన మెస్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. కూలిన సమయంలో ఆ భవనంలో ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశంపై సంబంధిత కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. వాస్తు దోషం కారణంగా ఈ భవనాన్ని కూల్చివేసినట్లు చెబుతున్నారు.
News April 19, 2026
చిత్తూరు: చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

గుడిపల్లి (M) కనుమనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో గుడ్డలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బేబీ (19), దుర్గ (21) మృతి చెందారు. వరుసకు అక్క చెల్లెలు అయిన బేబీ, దుర్గ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
News April 19, 2026
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్ట్ ఇయర్లో 12,567 మందికి 8,691 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్లో 11,651 మందికి 8,280 మందే పాసయ్యారు, 3,371 మంది ఫెయిలయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 27 లోపు ఫీజు చెల్లించాలి.


