News December 1, 2025

పచ్చదనంతో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ..!

image

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని గ్రీన్ క్యాంపస్ కాన్సెప్ట్‌తో ఆధునికంగా నిర్మిస్తున్నారు. 160.4 ఎకరాల్లో జరుగుతున్న పనుల్లో ఇప్పటికే 75% పూర్తయ్యాయి. సహజ వెలుతురు వినియోగం కోసం గ్లాస్ రేకులు అమర్చుతూ విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తున్నారు. నీటి సంరక్షణ లక్ష్యంగా చెరువులు, రైన్వాటర్ నిల్వ సదుపాయాలు, వ్యర్థ జల రిసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యాక్టరీ చుట్టూ భారీగా పచ్చదనం పెంచనున్నారు.

Similar News

News April 14, 2026

GNT: అమరావతిలో అగ్ని ప్రమాదాలకు చెక్!

image

అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ADCL దృష్టి సారించింది. ADCL 320కి.మీ. పరిధిలో జరుగుతున్న ట్రంక్ రోడ్లు,12 LPS జోన్ల పరిధిలోని కాంట్రాక్టర్లకు మార్గదర్శకాలు జారీచేసింది. నిర్మాణ సంస్థలు వారి క్యాంపు ప్రదేశాల్లో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి స్పష్టం చేశారు. అధికారులు అగ్ని ప్రమాదాల నివారణపై నిరంతరాయంగా క్యాంపులను సందర్శించి చర్యలు తీసుకోవాలన్నారు.

News April 14, 2026

మహనీయుడు అంబేడ్కర్

image

నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహాన్ని న్యాయశాఖ మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆవిష్కరించారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని వారు కొనియాడారు. అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని నుంచి గుర్తు చేశారు.

News April 14, 2026

దివ్యాంగులకు శుభవార్త.. కొత్తగా లక్ష పింఛన్లు!

image

TG: రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త. కొత్తగా లక్ష మందికి పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వీరయ్య వెల్లడించారు. 40 శాతం వైకల్యం ఉన్నవారికి అవసరమైన అడ్వాన్స్‌డ్ పరికరాలను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఇప్పటికే దివ్యాంగులకు తొలి విడతలో 4,500 ఇందిరమ్మ ఇళ్లను, 2వేల స్కూటీలను ఫ్రీగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.