News April 14, 2026
GNT: అమరావతిలో అగ్ని ప్రమాదాలకు చెక్!

అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ADCL దృష్టి సారించింది. ADCL 320కి.మీ. పరిధిలో జరుగుతున్న ట్రంక్ రోడ్లు,12 LPS జోన్ల పరిధిలోని కాంట్రాక్టర్లకు మార్గదర్శకాలు జారీచేసింది. నిర్మాణ సంస్థలు వారి క్యాంపు ప్రదేశాల్లో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి స్పష్టం చేశారు. అధికారులు అగ్ని ప్రమాదాల నివారణపై నిరంతరాయంగా క్యాంపులను సందర్శించి చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News April 20, 2026
GNT: ఇస్రో ‘యువికా’కు జిల్లా విద్యార్థినుల ఎంపిక.. కలెక్టర్ ప్రశంసలు

జాతీయ స్థాయిలో ఇస్రో నిర్వహించిన ‘యువికా’ యంగ్ సైంటిస్ట్ అవార్డులకు ఎంపికైన జిల్లా విద్యార్థినులను కలెక్టర్ సాయి కాంత్ వర్మ అభినందించారు. ఫిరంగిపురం (M) వేములూరిపాడుకు చెందిన జ్యోతిర్మయి, వట్టిచెరుకూరు (M) ముట్లూరుకు చెందిన సుస్మితా చంద్ ఈ గౌరవం దక్కించుకున్నారు. సోమవారం DEO సలీం భాషాతో కలిసి కలెక్టరేట్‌లో వారు కలెక్టర్‌ను కలిశారు. విద్యార్థినుల ప్రతిభను కలెక్టర్ ప్రత్యేకంగా కొనియాడారు.
News April 20, 2026
పట్టాలెక్కని ముఖ్య అమరావతి ప్రాజెక్టులు

అమరావతిలో కీలక నిర్మాణాలెవీ ఇంకా ప్రారంభం కాలేదు. ORR, IRR, విజయవాడ మెట్రో, విమానాశ్రయం, రైల్వే లైన్ వంటి ప్రాజెక్టులు ముందుకు సాగలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ టెండర్లు, భూసేకరణ దశల్లోనే ఉన్నాయి. రాజధాని అభివృద్ధికి ఈ ప్రాజెక్టులే అత్యంత కీలకం. ఇవి పట్టాలెక్కితేనే నగర రవాణా మెరుగుపడుతుందన్నారు. ప్రణాళికలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలు ఇంకా మొదలు కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.