News September 12, 2025
పల్నాడులో 14 నెలల విధులు నిర్వహించిన అరుణ్ బాబు

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా 14 నెలల పాటు పనిచేసిన పి. అరుణ్ బాబు బదిలీ అయ్యారు. ఆయన 2024 జులై 7న జిల్లా మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పల్నాడు జిల్లాకు వచ్చారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్‌గా లోతేటి శివశంకర్ పనిచేశారు.
Similar News
News September 12, 2025
JNTUH: బీటెక్ సెకెండ్ సెమిస్టర్ రిజల్ట్స్

బీటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను వర్సిటీ అధికారులు రిలీజ్ చేశారు. ఈ ఫలితాల్లో విద్యార్థులు తక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కేవలం 42.38 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు వర్సిటీ వెబ్ సైట్‌లో ఉన్నాయని ఎగ్జామినేషన్ డైరెక్టర్ క్రిష్ణమోహన్ రావు తెలిపారు.
News September 12, 2025
భూపాలపల్లి: 23 రైతు వేదికల ద్వారా యూరియా విక్రయాలు

రైతులకు యూరియాను సకాలంలో అందించడానికి కొత్తగా 23 రైతు వేదికల ద్వారా యూరియా విక్రయిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు. రేగొండ మండలం మడతపల్లి, దమ్మన్నపేట,మొగుళ్లపల్లి మండలంలో ములకలపల్లి, పర్లపల్లి, వేములపల్లి, చిట్యాలలో చైన్పాక, జూకల్, ఘనపూర్లో పరశురాంపల్లి, ఘనపూర్, భూపాలపల్లిలో పెద్దాపూర్, మలహర్‌లో రుద్రారం, మహదేవపూర్‌లో సూరారం, మహదేవపూర్, కాళేశ్వరంలలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
News September 12, 2025
అప్పులు ఆంధ్రాలో మాత్రమే పెరగలేదు: బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు పెరిగాయని జనరలైజ్డ్‌గా మాట్లాడటం సరికాదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గడచిన పదేళ్లలో కేంద్రం సహా చాలా రాష్ట్రాల్లో అప్పులు పెరిగాయని Way2News కాన్‌క్లేవ్‌లో వెల్లడించారు. అప్పటి కరోనా సహా ఇతర పరిస్థితులతో సరైన ఉపాధి, ఆదాయ అవకాశాలు లేవని తెలిపారు. ఇక విభజన తర్వాత చాలా కీలకమైన మొదటి 5 సంవత్సరాలు ఏ పనినీ సరిగా చేయలేకపోయారని ఆరోపించారు.