News April 4, 2025
పల్నాడు జిల్లాలో ఒకరి హత్య

మాచర్ల నియోజకవర్గ పరిధిలో హరిచంద్ర హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఆయన మృతదేహం పొలంలో ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా రెండు రోజుల క్రితం నాగార్జున సాగర్ హిల్ కాలనీలో హరిచంద్ర కిడ్నాప్‌కు గురయ్యారు. రెండు రోజుల తర్వాత ఆయన శవమై కనిపించారు. పోలీసులు తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. హత్యకు కుటుంబ కలహాలు కారణమా? రాజకీయా కోణమా? అనేది దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 10, 2025
చిక్కడపల్లి: విజయయాత్ర మార్గాన్ని పరిశీలించిన సీపీ

హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ రూట్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. గౌలిగూడ రామమందిరం నుంచి నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు చౌరస్తా, అశోక్‌నగర్, కవాడిగూడ, బైబిల్ హౌస్, తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు దాదాపు 12.2 కిలోమీటర్లు శోభాయాత్ర కొనసాగుతుందన్నారు. అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్‌సింగ్‌మాన్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ జోయల్ డేవిస్ ఉన్నారు.
News April 10, 2025
మోసపోయిన నెల్లూరు యువతి

నెల్లూరుకు చెందిన సాయిజ్యోత్స్న ఇన్‌స్టాలో ఓ లింక్ క్లిక్ చేయడంతో నితేశ్ అనే వ్యక్తి ఆమెకు వాట్సప్‌లో మెసేజ్ చేశాడు. ఆమె చేత ఓ కంపెనీ వస్తువు ఫీడ్‌బ్యాక్ చేయించి రూ.14వేలు అకౌంట్లో వేశాడు. తమ కంపెనీలో డిపాజిట్లు చేస్తే లాభాలు వస్తాయనడంతో ఆమె రూ.2.50లక్షలు డిపాజిట్ చేసింది. ఆ తర్వాత అకౌంట్లో ఎక్కువ డబ్బులు ఉన్నట్లు చూపించడంతో విత్ డ్రా పెట్టగా రాలేదు. మోసపోయానని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News April 10, 2025
మే చివరి నుంచే వర్షాలు పడే అవకాశం: స్కైమెట్

ఈ ఏడాది ‘నైరుతి’ వర్షపాతం సాధారణంగానే ఉండొచ్చని వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ‘జూన్-సెప్టెంబరు మధ్య 868.6 సెం.మీ సగటు వర్షపాతం నమోదు కావొచ్చు. TGలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 30% ఎక్కువ వర్షపాతం ఉండొచ్చు. APలో ఉమ్మడి అనంతపురం, కర్నూల్, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు తప్పితే మిగతా ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదవొచ్చు. మే నుంచే వానలు మొదలయ్యే ఛాన్స్ ఉంది’ అని పేర్కొంది.