News April 10, 2025

మే చివరి నుంచే వర్షాలు పడే అవకాశం: స్కైమెట్

image

ఈ ఏడాది ‘నైరుతి’ వర్షపాతం సాధారణంగానే ఉండొచ్చని వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ‘జూన్-సెప్టెంబరు మధ్య 868.6 సెం.మీ సగటు వర్షపాతం నమోదు కావొచ్చు. TGలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 30% ఎక్కువ వర్షపాతం ఉండొచ్చు. APలో ఉమ్మడి అనంతపురం, కర్నూల్, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు తప్పితే మిగతా ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదవొచ్చు. మే నుంచే వానలు మొదలయ్యే ఛాన్స్ ఉంది’ అని పేర్కొంది.

Similar News

News April 17, 2025

జేఈఈ మెయిన్ ఫైనల్ ‘కీ’ విడుదల

image

జేఈఈ మెయిన్ సెషన్ 2 <>ఫైనల్ కీ<<>> విడుదలైంది. ఏప్రిల్ 2 నుంచి 9 వరకు సెషన్ 2 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి.

News April 17, 2025

ఆలయాలలోని 1000కేజీల బంగారం కరిగింపు.. ఎక్కడంటే?

image

తమిళనాడులోని 21దేవాలయాలలో భక్తులు సమర్పించిన 1000 KGల బంగారు ఆభరణాలను కరిగించినట్లు అధికారులు తెలిపారు. వాటిని 24 క్యారెట్ల కడ్డీలుగా మార్చి SBIలో డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.17.81కోట్ల వడ్డీ రానుండగా, ఆ నిధులతో ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఆలయాలలో నిరుపయోగంగా ఉన్న వెండిని సైతం కరిగించి డిపాజిట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

News April 17, 2025

ALERT: కాసేపట్లో భారీ వర్షం

image

తెలంగాణలోని కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాత్రి 7 గంటల లోపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అటు మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన మోస్తరు వాన పడుతుందని ఇప్పటికే అంచనా వేసింది. ప్రజలు ఎత్తైన ప్రదేశాలు, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. కాగా ఆదిలాబాద్‌ జిల్లాలో సాయంత్రం వడగళ్ల వాన కురిసింది.

error: Content is protected !!