News January 17, 2026

పాతబస్తీ మెట్రోపై హైకోర్టు ఆరా.. ఫిబ్రవరి 4న కీలక నివేదిక!

image

MGBS-ఫలక్‌నుమా రూట్‌లో నిర్మించే మెట్రో లైన్‌ విషయంలో చారిత్రక కట్టడాల రక్షణపై హైకోర్టు దృష్టి సారించింది. చార్మినార్ వంటి కట్టడాల దృశ్య సౌందర్యం దెబ్బతినకుండా పిల్లర్ల నిర్మాణం ఎలా ఉంటుందో వర్చువల్ వాక్‌త్రూ ద్వారా FEB 4లోగా చూపాలని అధికారులను ఆదేశించింది. వారసత్వ సంపదకు నష్టం వాటిల్లని రీతిలో మెట్రో అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. దీని ఆధారంగానే 5.5KM మేర సాగే ఈ మెట్రో లైన్ ఖరారు కానుంది.

Similar News

News April 20, 2026

కొడంగల్‌: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

image

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.