News April 5, 2025
పానగల్: గంధోత్సవంలో పాల్గొన్న మంత్రి జూపల్లి

పానగల్ మండల కేంద్రంలోని ఖిల్లా గట్టుపై ఉన్న హజరత్ ఆఘా దావుద్ గంధోత్సవ కార్యక్రమం పాన్‌గల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాము యాదవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై హజరత్ ఆఘా దావుద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ ఉన్నారు.
Similar News
News April 12, 2025
983 మార్కులతో సత్తా చాటిన గొల్లప్రోలు విద్యార్థిని

గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న సాయి జ్యోతి 983 మార్కులు సాధించి ఔరా అనిపించింది. పట్టణానికి చెందిన ఆమె MPC విభాగంలో ఈ ఘనత సాధించింది. జ్యోతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివింది. కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కళాశాలలో ఎంపీసీ విభాగంగాలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
News April 12, 2025
బెంగాల్‌లో అల్లర్లు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

వక్ఫ్ చట్టం సవరించిన నేపథ్యంలో బెంగాల్‌లో కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ‘చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. మేం కాదు. మీరు కేంద్రంతోనే తేల్చుకోండి. సవరించిన వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ఇప్పటికే చెప్పాం. కాబట్టి అన్ని మతాల ప్రజలు శాంతించండి’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ అల్లర్లలో ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు.
News April 12, 2025
CSK మరో చెత్త రికార్డు

ఐపీఎల్-2025లో ఇప్పటివరకు అత్యధిక డాట్ బాల్స్ (245) ఆడిన జట్టుగా CSK నిలిచింది. నిన్న KKRతో ఆడిన మ్యాచులోనే 61 డాట్ బాల్స్ ఆడటం గమనార్హం. ఈ లిస్టులో CSK తర్వాత వరుసగా KKR (245), RR (206), RCB (202), MI (198), SRH (191), LSG (186), GT (167), PBKS (145), DC (123) ఉన్నాయి. ఐపీఎల్‌లో ఒక్కో డాట్ బాల్‌కు బీసీసీఐ 500 మొక్కలను నాటుతున్న సంగతి తెలిసిందే.