News April 12, 2025
CSK మరో చెత్త రికార్డు

ఐపీఎల్-2025లో ఇప్పటివరకు అత్యధిక డాట్ బాల్స్ (245) ఆడిన జట్టుగా CSK నిలిచింది. నిన్న KKRతో ఆడిన మ్యాచులోనే 61 డాట్ బాల్స్ ఆడటం గమనార్హం. ఈ లిస్టులో CSK తర్వాత వరుసగా KKR (245), RR (206), RCB (202), MI (198), SRH (191), LSG (186), GT (167), PBKS (145), DC (123) ఉన్నాయి. ఐపీఎల్‌లో ఒక్కో డాట్ బాల్‌కు బీసీసీఐ 500 మొక్కలను నాటుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News April 17, 2026
ఇచ్చేయండి సార్.. షరీఫ్‌కు నోబెల్ ఇవ్వాలంటూ పాక్‌లో తీర్మానం!

‘నోబెల్’ విషయంలో ట్రంప్‌కు పాక్ పోటీ ఇస్తోంది. తమ PM షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌కు పీస్ ప్రైజ్ ఇవ్వాలన్న మీడియా <<19605334>>ప్రచారానికి<<>> పంజాబ్ అసెంబ్లీ వంతపాడింది. యుద్ధం ఆపేందుకు చేసిన ప్రయత్నాలకు వారికి ఇవ్వాల్సిందేనని తీర్మానం చేసింది. పాక్‌లో జరిగిన చర్చలు ఫలించలేదు. కానీ ట్రంప్ తాను <<19668983>>10వ వార్<<>> ఆపబోతున్నానని మళ్లీ నోబెల్ రేసులోకొచ్చారు. మరి పాక్ కథ ట్రంప్ చెవిన పడిందో లేదో!
News April 17, 2026
సౌందర్య.. అచ్చ తెలుగు ఆడపడుచులా!

టాలీవుడ్‌లో మహానటి సావిత్రి తర్వాత అంతటి అభిమానం పొందిన హీరోయిన్లలో సౌందర్య ఒకరు. ‘మనవరాలి పెళ్లి’తో 1993లో తెలుగు సినిమాల్లోకి వచ్చి పదేళ్లు సినీరంగాన్ని ఏలారు. 100కుపైగా మూవీస్‌లో నటించారు. అసభ్య వస్త్రధారణకు దూరంగా నిండైన చీరకట్టుతో అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించేవారు. కానీ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. నేడు సౌందర్య వర్ధంతి.
News April 17, 2026
ఇండియాకు వాంటెడ్ టెర్రరిస్టులు.. పాక్‌లో హతం!

లష్కరే తోయిబా(LeT) కో ఫౌండర్ అమీర్ హమ్జాపై పాక్‌లో <<19664047>>కాల్పులు<<>> జరగడం తెలిసిందే. మూడేళ్లుగా LeT, జైషే(JeM), హిజ్బుల్(HM)లోని వాంటెడ్ టెర్రరిస్టులు ‘గుర్తుతెలియని వ్యక్తుల’ కాల్పుల్లో హతమవుతున్నారు. మహ్మద్ తాహిర్ అన్వర్(JeM చీఫ్ మసూద్ అజర్ అన్న), LeT టెర్రరిస్టు అబు ఖతల్(హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు), ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్‌వార్‌తో సహా ఎంతో మందిని పాక్‌లో మట్టుబెట్టారు.


