News March 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News March 11, 2025

హీరోకు గాయం.. మరింత ఆలస్యం కానున్న ‘వార్-2’!

image

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వార్-2’ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది. ఈ చిత్రంలో స్టార్ హీరోల మధ్య ఓ సాంగ్ ప్లాన్ చేయగా తాజాగా రిహార్సల్స్‌లో హృతిక్ గాయపడినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మేలో ఈ పార్ట్ షూట్ చేస్తారని సమాచారం. దీంతో విడుదలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

News March 11, 2025

2027 నాటికి భారత్‌లో భారీగా ఏఐ నిపుణుల కొరత

image

వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా ఎదిగేందుకు భారత్ సిద్ధంగా ఉందని బెయిన్ అండ్ కంపెనీ అంచనా వేసింది. అయితే దేశంలో ఏఐ నిపుణుల కొరత పెరుగుతోందని తెలిపింది. 2027 నాటికి 10 లక్షలకు పైగా నిపుణుల కొరత ఉండొచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఉద్యోగ అవకాశాలు 23 లక్షలు దాటొచ్చని పేర్కొంది. ఏఐకి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఈ రంగంలో నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉందని తెలిపింది.

News March 11, 2025

శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌కు అవార్డు

image

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ విమానాశ్రయం ఈ అవార్డుకు ఎంపికైంది. 2024కు గానూ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15-25 మిలియన్ల ప్రయాణికులకు రాకపోకలు అందించి బెస్ట్ విమానాశ్రయంగా నిలిచింది. విమానాశ్రయ పరిణామం, సిబ్బంది తీరు, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.

error: Content is protected !!