News March 11, 2025
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అవార్డు

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ విమానాశ్రయం ఈ అవార్డుకు ఎంపికైంది. 2024కు గానూ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15-25 మిలియన్ల ప్రయాణికులకు రాకపోకలు అందించి బెస్ట్ విమానాశ్రయంగా నిలిచింది. విమానాశ్రయ పరిణామం, సిబ్బంది తీరు, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.
Similar News
News March 21, 2025
అలా జరిగితే ‘మ్యాడ్ స్క్వేర్’ రికార్డు!

నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ ఈనెల 28న విడుదల కానుంది. వారం రోజుల్లో విడుదలవనుండగా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయకూడదని మేకర్స్ భావిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇలా జరిగితే ట్రైలర్ లేకుండా రిలీజైన తొలి సినిమాగా రికార్డులకెక్కనుంది. కాగా, ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీగా అంచనాలున్నాయి.
News March 21, 2025
CUET UG దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) <
News March 21, 2025
పచ్చళ్లు అతిగా తింటే క్యాన్సర్ రావొచ్చు!

అతిగా పచ్చళ్లు తినడం ప్రమాదకరమని ప్రముఖ వైద్యుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. ‘పచ్చళ్ళలో పెరిగే శిలీంధ్రాలు (బూజు/ఫంగస్) నైట్రేట్లని నైట్రైట్లుగా మారుస్తాయి. ఇవి క్యాన్సర్ కారకాలు. అప్పుడప్పుడూ తిన్నవారిని ఇవేం చేయలేవు. కానీ, అదేపనిగా తింటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ ఇది ప్రమాదకరమే. నిలువ పచ్చళ్ల కంటే అప్పుడే చేసిన రోటి పచ్చళ్లు సేఫ్’ అని తెలిపారు.