News April 18, 2026

పులివెందుల టీడీపీలో వర్గపోరు?

image

పులివెందుల టీడీపీలో వర్గపోరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అంటీఅంటనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. అంతే కాకుండా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ కోవర్టు అని వ్యాఖ్యానించారు. ప్రధాన నేతల మధ్యే సఖ్యత లేకపోతే ఎలా అని కార్యకర్తలు భావిస్తున్నారు.

Similar News

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

image

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.